అమృతనగర్ వాసులకు సీఎం రమేష్ నాయుడు భరోసా
- PRASANNA ANDHRA

- Apr 3, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని అమృత నగర్ ను నేడు రాజ్యసభ ఎంపీ బీజేపీ నాయకులు రమేష్ నాయుడు సందర్శించారు, ఈ సందర్భంగా అమృత నగర్ ను అభివృద్ధి పథంలో నడిపించడానికి ఏంపి రమేష్ నాయుడు తన వంతు సహాయం ప్రకటించడం జరిగింది. అమృత నగర్ లోని ముస్లిం కమిటీ నాయకులందరూ ఎంపీ సీఎం రమేష్ నాయుడి ని కలిసి తమ పేరాంతంలోని సమస్యలను వివరించారు, అనంతరం ఆయన అమృత నగర్ ఫేసే-2 ముస్లిం స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణం, ( బోరు) నీటి సదుపాయం కల్పించడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్రం నిధులు నుంచి వాటర్ ప్లాంట్ ఏర్పాటు కూడా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమృత నగర్ ముస్లిం కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు.















Comments