సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఉగాది సంబరాలు
- PRASANNA ANDHRA

- Mar 22, 2023
- 1 min read
సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసంలో
ఉగాది సంబరాలు

తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసంలోని వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టి పడే విధంగా ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోని గోశాలలో ఉగాది సంబరాలు జరుపుకున్నారు. సీఎం నివాసంలోని గోశాలలో తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లేలా సెట్టింగ్ లు ఏర్పాటు చేశారు. తిరుమల ఆనంద నిలయం తరహాలో ఆలయ నమూనాలు ఏర్పాటు చేశారు. పంచాంగ శ్రవణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.










Comments