రాచమల్లు దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
- PRASANNA ANDHRA

- Dec 21, 2022
- 1 min read

వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు
నియోజకవర్గ వ్యాప్తంగా వైసిపి నాయకులు, కార్యకర్తలు, తమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరుపుకోగా, ప్రత్యేకించి ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి రాచమల్లు రమాదేవి జరిపిన పుట్టినరోజు వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దాదాపు 1000 మంది మహిళలకు చీరాసారే ఇచ్చారు ఎమ్మెల్యే దంపతులు. స్థానిక బైపాస్ నందు గల శ్రీదేవి కళ్యాణ మండపంలో పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తల నడుమ ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు నిలిచాయి. భారీ కేకు కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యే దంపతులు మహిళలను ఆప్యాయంగా పలకరించి, వారి చేతుల మీదుగా చీరసారే ఒడి బియ్యం ఇచ్చి వారి ఆదరాభిమానాలు పొందారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ఆడపడుచులందరూ తన తోబుట్టువులతో సమానమని, వారిని తాను ఎమ్మెల్యేగా కొనసాగినన్ని రోజులు ఇదే విధంగా చీర సారే ఇచ్చి గౌరవిస్తానని, వారి ఆశీస్సులు తనపై తన కుటుంబం పై ఎల్లవేళలా ఉండాలని, ప్రత్యేకించి తమ నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మహిళలు ఆదరించి నిండుగా ఆశీర్వదించాలని ఆయన కోరారు.

అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సందర్భంగా ఆయన తన సతీమణి రాచమల్లు రమాదేవి ఆలోచన లో భాగంగానే గత కొద్ది సంవత్సరాలుగా చీరాసారే ఒడి బియ్యం కార్యక్రమాన్ని వేల మంది తన తోబుట్టువు సమానులను ఇస్తున్నట్లు, ఇందుకుగాను రాచమల్లు రమాదేవికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వైసిపి నాయకులు, నాయకురాల్లు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.








Comments