శివాలయం కూడలి వద్ద క్లాక్ టవర్ నిర్మాణం
- PRASANNA ANDHRA

- Sep 4, 2023
- 1 min read
ప్రొద్దుటూరు శివాలయం కూడలి వద్ద క్లాక్ టవర్ నిర్మాణం


వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం కూడలి వద్ద జగనన్న స్మార్ట్ హౌస్ టౌన్ షిప్ లో భాగంగా క్లాక్ టవర్ నిర్మాణం చేపట్టనున్నట్లు, సోమవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అనుడా వారి సహకారంతో శివాలయం సర్కిల్ నందు త్వరలో క్లాక్ టవర్ నిర్మాణం చేపట్టి, అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్ది రాబోవు ఎనిమిది నెలల కాలంలో క్లాక్ టవర్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందించనున్నట్లు ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది ప్రజలకు అందించాలనే లక్ష్యంతో, పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాబోవు 10 నెలల కాలంలో పట్టణాన్ని అందంగా తీర్చిదిద్ది ప్రజలకు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.









Comments