భవన నిర్మాణ కార్మిక సంఘం(సి ఐ టి యు) నూతన కమిటీ ఎన్నిక
- PRASANNA ANDHRA

- Jan 7, 2022
- 1 min read
రాయచోటి పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం ( సిఐటియు అనుబంధం) నూతన కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నల్లమల్ల శంకరయ్య, నల్లమల కిషోర్ లు ఎన్నికయ్యారు.
శుక్రవారం పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రామాంజులు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గురువారం పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం ముఖ్య సమావేశం జరిగిందని ఈ సమావేశానికి సంఘం జిల్లా కన్వీనర్ ఏ రామ్మోహన్ సమక్షంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి పలు తీర్మానాలు చేయడంతో పాటు ఈనెల 23వ తేదీన మైదుకూరు లో జరిగే భవన నిర్మాణ కార్మికుల సంఘం 2 వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ భవన నిర్మాణ కార్మికుల సంఘం నూతన కమిటీ ఎన్నుకున్నట్లు తెలిపారు.
నూతనకమిటి : అధ్యక్షుడు : N . శంకరయ్య, ప్రధాన కార్యదర్శి : N.కిషోర్, కోశాధికారి A.రాంబాబు, గౌరవ అధ్యక్షుడు A.రామాంజులు
కమిటీ సభ్యులుగా మోహన్, మాధవయ్య, దశరధ,సుబ్రహ్మణ్యం, నాగేంద్ర, బాబు, వెంకటరమణ, రవి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.










Comments