సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కలెక్టర్లకు సిఐటియు వినతి.
- DORA SWAMY

- May 13, 2022
- 1 min read
---సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే, కలెక్టర్ కి సంయుక్తంగా సిఐటియు వినతి పత్రం.
అన్నమయ్య జిల్లా నూతన జిల్లా కలెక్టర్ గిరీష, రైల్వేకోడూరు కి మొదటిసారిగా హాజరైన సందర్భంగా.. సి ఐ టి యు, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కోడూరు నియోజకవర్గ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని వారు ఎమ్మెల్యే కొరుముట్ల జిల్లా కలెక్టర్ కు సంయుక్తంగా వినతి పత్రం అందించారు.

వారిరువురి తో సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్.చంద్రశేఖర్ మాట్లాడుతూ... గత ఆరు నెలల క్రితం గుంజన నది, వరదల్లో 27 ఇల్లు కొట్టకపోతే నేటికీ నష్టపరిహారం అందలేదని, తక్షణమే బాధితులను ఆదుకోవాలని కోరారు.
అన్నమయ్య వరద బాధితులను ఆదుకోవాలని గుంజన ఏరు కి ప్రొడక్షన్ వారు నిర్మించాలని ఎందరో పేద ఎదురుచూస్తున్నా అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి పేదలకు భూమి పట్టాలు ఇవ్వాలని బోగస్ అసైన్మెంట్ ల పై కమిటీ వేసి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు వర్తింపజేసి బాధితులకు న్యాయం చేయాలని వెంకటగిరి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని రైల్వే కోడూరు నందు సబ్ రిజిస్టర్ ఆఫీస్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని జిల్లా అయినటువంటి రాయచోటి కి రైల్వేకోడూరు,రాజంపేట,తిరుపతి నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని కోరగా.. త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కొరముట్ల కలెక్టర్ గిరీష లు వివరణ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, రాజంపేట ఆర్డిఓ, ఎమ్మార్వో రామ్మోహన్, సిఐటియు ఉపాధ్యక్షులు లింగాల యానాదయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, సిగి చెన్నయ్య, బొజ్జ శివయ్య, ఆవాస్ మండల కన్వీనర్, పి మౌలాలి భాష, తదితరులు పాల్గొన్నారు.








Comments