top of page

వాగ్దానాలు సరే అమలు ఎక్కడ - తాతంశెట్టి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 4, 2022
  • 1 min read

చిట్వేలి సమస్యలపై గళమెత్తిన జనసేన పార్టీ నాయకులు - వాగ్దానాలు సరే అమలు ఎక్కడన్న తాతంశెట్టి నాగేంద్ర.

ree

చిట్వేలి పట్టణంలో స్థానిక సమస్యలపై బుధవారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమశిల వెనుక జలాలు చిట్వేలి కి వస్తున్నాయి,చిట్వేలి వయా కోడూరు ప్రధాన రహదారి పనులు మొదలవుతున్నాయి.. వంటి వాగ్దానాలు కేవలం ప్రకటనలకు పరిమితం అయ్యాయని, కార్యరూపం దాల్చటం లేదని దుయ్యబట్టారు.అగ్రికల్చర్ హబ్ గా ఉన్న చిట్వేలి లో రైతులు పండించిన పంటల కోసం కోల్డ్ స్టోరేజ్ లు నిర్మించాలని కోరారు.


అలాగే పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థి, విద్యార్థినులు ,కరెంట్ కోతల వలన ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం ముందు చూపు లేకపోవడమే విద్యుత్తు కోతలకు కారణమని కరెంటు చార్జీలను పెంచడం లో ఉన్న ముందు చూపు ప్రజలకు కరెంటు అందించడంలో లేకపోయిందని దుయ్య బట్టారు. అంతయూ గమనిస్తున్న ప్రజలు రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి గట్టిగా సమాధానం ఇస్తారని అన్నారు.


ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాదాసు శివ, పురం సురేష్, కంచర్ల సుధీర్ రెడ్డి, కడుమురి సుబ్రమణ్యం, మురళి కృష్ణ, హరి ప్రసాద్, భరత్,లోకేష్,జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page