top of page

రిషిక ఆరోగ్యం కుదుటపడాలని యువత ప్రత్యేక పూజలు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 20, 2022
  • 1 min read

రిషిక త్వరగా కోలుకోవాలని యువత ప్రత్యేక పూజలు.


ree

మాత్రను తీసుకోవడంలో జరిగిన చిన్న తప్పిదంతో అపస్మారపు స్థితిలోకెళ్ళి గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్ది కొద్దిగా మెరుగుపడుతున్న పాప రిషిక ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని క్షేమంగా తిరిగి రావాలి బుధవారం చిట్వేలి శ్యామలాంబ సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో స్వామికి, అమ్మవారికి మండల పాత్రికేయులు, యువత అభిషేకం అర్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.


కాగా మానవసేవే మాధవసేవ అన్న తలంపుతో ఏ బంధము లేక పోయినా ఆపదలో ఉన్న ఆ బిడ్డకు సాయం చేయాలన్న పిలుపుతో స్పందించి పాప వైద్య ఖర్చులకు సహాయం అందించిన, అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ బాధితులు, దాతల ఆశీస్సులు పాపకు నిండుగా ఉండాలని వారు దేవుని ప్రార్థించారు.


ఈ కార్యక్రమంలో మండల పాత్రికేయులు సాయిరాం, అవినాష్, సాయి,యువత పగడాల శివ,పసల శివ,మాదినేని హరి తదితరులు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page