top of page

"సిద్ధం" సభకు తరలిన మండల వైకాపా శ్రేణులు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Feb 18, 2024
  • 1 min read

"సిద్ధం" సభకు తరలిన మండల వైకాపా శ్రేణులు.

---ఏర్పాట్లను సమీక్షించిన మండల నేతలు.

ree

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రాప్తాడులో తలపెట్టిన సిద్ధం సమావేశానికి ఆదివారం చిట్వేలి మండలం నుంచి భారీ ఎత్తున వైకాపా నేతలు అభిమానులు తరలి వెళ్లారు. కార్యక్రమ ఏర్పాట్లను మండల వైసీపీ కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులురెడ్డి, వైసిపి నాయకులు గ్రామ ఉపసర్పంచ్ చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి, కనీస వేతనాల సలహా బోర్డు మెంబర్ మల్లిశెట్టి వెంకటరమణ లు సమీక్షించారు.

ree

సంక్షేమానికి అర్థం వైసిపి ప్రభుత్వం అని, ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీని తిరిగి వైసిపికి అందిస్తారని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు. ఎంతమంది కలిసి కుయుక్తులు పన్నినా ప్రజల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న విశ్వాసాన్ని దూరం చేయలేరని వారన్నారు. రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానాన్ని గతం కన్నా ఎక్కువ ఓట్లు మెజారిటీతో గెలుపును సాధిస్తామన్నారు. అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో తిరిగి వైసీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు ఎం కనకరాజా,మోచర్ల నరసింహ, సర్పంచ్ బాలు సచివాలయ కన్వీనర్లు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page