top of page

వైసిపి ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే కొరముట్లతో చిట్వేలి మండల వైసీపీ నాయకులు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 8, 2022
  • 1 min read

వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో చిట్వేలు మండల వైసీపీ నాయకులు.



ree

గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపాన ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సిపి పార్టీ ప్లీనరీ సమావేశాలకు అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలోని వైసీపీ నాయకులు పాటూరి శ్రీనివాసుల రెడ్డి, మండల వైసీపీ కన్వీనర్

చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ తదితరులు హాజరయ్యారు.


ప్రభుత్వ విప్,రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులతో కలిసి ప్లీనరీ సమావేశ ఏర్పాట్ల లలో వీరు తమదైన సేవలు అందించారు.


ree

ree

వారు మాట్లాడుతూ పార్టీ ప్లీనరీ సమావేశానికి హాజరైన జనసందోహం అలివి కానిదని అంతటి ఆధార అభిమానులు పొందడం మరే నాయకుడికి సాధ్యం కాదని అది కేవలం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి తనయుడు ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే సాధ్యమని పేర్కొన్నారు.



ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను కేవలం మూడు ఏళ్లకే సుమారు 95 శాతం మేర అమలు చేసి చూపిన ఘనత జగన్మోహన్ రెడ్డి దేనని, ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా వారి కుటుంబం ప్రజలకే అంకితమని;ఆడిన మాటకు కట్టుబడి అర్థం తీసుకొచ్చిన పార్టీ వైసిపి అని, రానున్న మరో 20 ఏళ్లు వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి తిరుగులేదని, ఇచ్చిన మాటకు, నిబద్ధతకు విలువల కోసం ప్రాణాలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమని ప్రస్తుత ప్రజాధ ఆదరణ చూసి ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలను తగ్గించుకోవాలని వారన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో లింగం లక్ష్మికర్,దేవ రాజు, గులాం భాష, నవీన్, ఆసిఫ్, సుబ్బరాయుడు, రవి, ప్రకాష్ మరియు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page