top of page

శిక్షణలో పథకాలు పొందిన ఎన్సిసి క్యాడేట్లకు అభినందన.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 4, 2022
  • 1 min read

పథకాలు పొందిన ఎన్సిసి క్యాడెట్లకు అభినందన.


ree

అన్నమయ్య జిల్లా చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యను అభ్యసిస్తున్న ఎన్సిసి క్యాడెట్లు 30 ఆంధ్ర ఎన్సిసి బెటాలియన్ నిర్వహించిన నాలుగవ కంబైన్డ్ వార్షిక శిక్షణ శిబిరంలో పది రోజుల శిక్షణ పూర్తి చేసుకుని పథకాలు సాధించిన విద్యార్థులను... ఈ రోజున ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, ఎన్సిసి అధికారి పసుపుల రాజశేఖర్ లు అభినందించారు.


ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి మాట్లాడుతూ ఎన్సిసి శిక్షణ ద్వారా క్రమశిక్షణ, ఐకమత్యం, దేశం పట్ల భక్తి భావం చిన్నతనంలోనే అలవాడతాయని ఉన్నతమైన వ్యక్తిత్వం పెంపొందడానికి ఎన్సీసీ శిక్షణ ఎంతగానో ఉపయోగకరమని పేర్కొన్నారు.


ఎన్సిసి అధికారి పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ గత నెల 25 నుండి ఈ నెల 4 తేదీ వరకు జరిగిన శిక్షణ శిబిరంలో క్యాడెట్లకు డ్రిల్, మ్యాప్ రీడింగ్,గుడారాలను ఏర్పాటు చేయడం,వెపన్ ట్రైనింగ్, ఫైరింగ్ మొదలగు విభాగాలలో శిక్షణ పొందారన్నారు. కడప,అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చి పాల్గొన్న క్యాడేట్లలో మన ఉన్నత పాఠశాల నుంచి వెండి పథకాలను దివ్యరాణి, లోకేష్ లు పొందగా, భవ్యశ్రీ కాంస్య పథకం సాధించడం పాఠశాలకు గర్వంగా ఉందన్నారు. ఇంకనూ శిబిరంలో శిక్షణ పొందిన సార్విక,రూప,ఇందు, నిస్సార్, జస్వంత్, చరణ్, లక్ష్మి,సుబ్రహ్మణ్యం లను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page