top of page

చిట్వేలు గ్రంథాలయానికి వాటర్ డిస్పెన్సెర్ వితరణ.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 17, 2022
  • 1 min read

చిట్వేలు గ్రంథాలయానికి వాటర్ డిస్పెన్సెర్ వితరణ. దాతలు: చౌడవరం వెంకట నరసింహ రెడ్డి (బాబు), సురేంద్ర రెడ్డి.

చిట్వేల్ గ్రంథాలయానికి వచ్చే పాఠకులు మరియు విద్యార్థుల సౌలభ్యమై మండు వేసవిలో వారికి చల్లని నీరు వసతి కల్పించాలనే సంకల్పంతో చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ చొరవతో దాతలు చౌడవరం వెంకట నరసింహ రెడ్డి (బాబు), సురేంద్ర రెడ్డి వారి తండ్రి గారైన కీ.శే.చౌడవరం రంగారెడ్డి జ్ఞాపకార్థముగా ఈరోజు వాటర్ డిస్పెన్సెర్ వితరణ చేశారు.


ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయాల కార్యదర్శి అమీరుద్దీన్, చిట్వేల్ శాఖ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ పెద్దాయన రంగారెడ్డి ప్రతి రోజు గ్రంధాలయానికి క్రమం తప్పకుండ వచ్చేవారని , వారి జ్ఞాపకార్థముగా వాటర్ డిస్పెన్సెర్ వితరణ చేయడం చాలా సంతోష దాయకమని , వారి కుమారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా గ్రంధాలయ అవసరాన్ని గుర్తించి చొరవ చూపిన సి .హెచ్.ఎస్ ప్రతినిధి గాడి.ఇంతియాజ్ కు అభినందలు తెలిపారు .


దాతలు చౌడవరం వెంకట నరసింహ రెడ్డి, సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ మానవ సేవె మాధవ సేవ అనే నినాదంతో సమాజంలో ఎప్పటికప్పుడు అవసరాలను గుర్తించి తమవంతుగా సానుకూలంగా స్పందిస్తున్న చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని, తమవంతు సహకారం ఎల్లపుడు ఉంటుందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో చౌడవరం సురేంద్ర రెడ్డి ,గాయకుడు పుట్ట పెంచల్ దాసు, సి.హెచ్ .ఎస్ సభ్యులు సమ్మెట వీరాంజనేయరాజు, బొంతల నాగేష్, ఇంతియాజ్ , గాలా.శివారెడ్డి, పెమ్మసాని పురుషోత్తం చౌదరి, సుబ్బరాజు , ఉపాధ్యాయులు అంజన్న, శ్రీనివాసులు, గ్రంధాలయ అధికారులు, అమీరుద్దీన్, శ్రీనివాసులు, సుజాత తదితరులు పాల్గొన్నారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page