top of page

చిట్వేలు లో ఘనంగా బిజెపి 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 6, 2022
  • 1 min read

చిట్వేలు లో ఘనంగా బిజెపి 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళతామన్న నాయకులు.

ree

ఈరోజు ఉదయం బిజెపి 43 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని...చిట్వేలి మండల పరిధిలోని బిజెపి కార్యాలయం నందు బిజెపి మండల అధ్యక్షులు ఆకేపాటి వెంకట రెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులతో కలసి ఘనంగా నిర్వహించి పార్టీ జెండా ఆవిష్కరించి, అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు.

ree

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యులు తొంబరపు సుబ్బరాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్ రాజు, మాధవయ్య గౌడ్, మండల బాధ్యులు ఆకేపాటి వెంకటరెడ్డి తదితరులు మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ నాయకత్వంలోనీ బిజెపి పార్టీ దశదిశలా వ్యాప్తిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఉందని.. గత కొద్ది రోజుల క్రితం నాలుగు రాష్ట్రాలలో వెలువడిన ఫలితాలే దీనికి నిదర్శనమని పేర్కొంటూ... బడుగు బలహీన అన్ని సామాజిక వర్గాల ను కలుపుకుంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మద్దతుదారులతో కలిసి అన్నిచోట్ల పోటీ చేస్తామని దీనికిగాను గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బూత్ లెవెల్ కమిటీలను ఏర్పరిచి పార్టీ పురోగతికి పటిష్టంగా కృషి చేస్తామని వారు అన్నారు.

ree

ఈ కార్యక్రమంలో బిజెపి సభ్యులు సురేంద్ర, సందీప్, ప్రసాద్ రాజు, హరి, దిలీప్, సత్యనారాయణ, నాగేశ్వరరావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page