ఘనంగా బాలల దినోత్సవం
- PRASANNA ANDHRA

- Nov 14, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు
నవంబర్ 14వ తేదీ భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం పురస్కరించుకొని, ప్రొద్దుటూరు స్థానిక గోపికృష్ణ సెంట్రల్ స్కూల్ నందు కరస్పాండెంట్ కోనేటి ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు దేశ నాయకుల, దేశభక్తుల, పర్యావరణ, సామాజిక, మొదలగు వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు జవహర్ లాల్ నెహ్రూ జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు తెలియజేశారు. జవహర్ లాల్ నెహ్రూ నడవడికతో జీవితంలో ఉన్నత శిఖరాలను ప్రతి విద్యార్థి అధిరోహించాలని విద్యార్థులకు హితవుపలికారు. ఈ కార్యక్రమంలో గోపికృష్ణ సెంట్రల్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.








Comments