top of page

పట్టభద్రులు తమ ఓటు ను నమోదు చేసుకోండి. చెవ్వు శ్రీనివాసులు రెడ్డి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Oct 20, 2022
  • 1 min read

పట్టభద్రులు తమ ఓటు ను నమోదు చేసుకోండి. చెవ్వు శ్రీనివాసులు రెడ్డి.

--పట్టభద్రుల ఎమ్మెల్సీ గా వెన్నపూస రవీంద్రారెడ్డిని గెలిపించుకుందాం.

ree

పట్టభద్రుల డిమాండ్లు సాధించడానికి ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.గురువారం ఉదయం మండల పరిధిలోని వైసీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశమై పట్టభద్రుల ఓటర్ల జాబితా, నమోదు తదితర అంశాలపై చర్చించారు.

గతంలో ఉన్న ఓటర్ల జాబితాను ప్రభుత్వం రద్దు చేసిందని పట్టభద్రులైన ప్రతి ఒక్కరు నూతనంగా ఓటు నమోదు చేసుకోవాలని ఈ ప్రక్రియ నవంబర్ 7వ తేదీ వరకు కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకుని వైసిపి పార్టీ తరుఫున పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న వెన్నపూస రవీంద్రారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెవ్వు శ్రీనివాసులురెడ్డి కోరారు.

ree

ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఉమామహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ, లింగం లక్ష్మి కర్,బి రమణారెడ్డి, సుధీర్ రెడ్డి, సర్పంచ్ ఈశ్వరయ్య, శ్రీను, సుధాకర్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page