స్వర్గీయ పివి చలపతిరావు ఆదర్శనీయులు - బిజెపి
- EDITOR

- Jun 26, 2024
- 1 min read
స్వర్గీయ పివి చలపతిరావు ఆదర్శనీయులు - బిజెపి

గాజువాక, ప్రసన్న ఆంధ్ర జూన్ 26
గాజువాక పంతులు గారి మేడ బిజెపి కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆద్వర్యంలో బిజెపి మాజీ ఎం.ఎల్.సి మరియు ఉమ్మడి ఆంధ్ర రాష్టృ అధ్యక్షులు కీ.శే పి.వి చలపతిరావు గారి జయంతి సందర్బంగ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘణంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగ వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ , ఎన్నో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసి పార్టీ బలోపేతంకి పివి చలపతిరావు గారు విశేషంగా కృషి చేసారని అన్నారు. నేటి యువతకు ఆయన ఆదర్శనీయులని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొండా యల్లాజీరావు , మండల అధ్యక్షులు పి.నాగేశ్వరావు , కోసూరు.తాతారావు, పేర్ల.అప్పారావు, టి.వెంకటరావు, అనిత, శిరీష, రామస్వామి,గురప్ప ,రాజశేఖర్, సంతోష్, పాటక్ తదితరులు పాల్గొన్నారు.









Comments