నరసరావుపేట లో ఉద్రిక్తత, చదలవాడకు అస్వస్థత
- PRASANNA ANDHRA

- Jan 15, 2022
- 1 min read
నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో టీడీపీ ధర్నా, గుంటూరు - కర్నూలు హైవేపై బైఠాయించిన నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ చదలవాడ అరవింద బాబు, నాయకులు, కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు అనిల్, రాజేశ్ అరెస్టుకు నిరసనగా రోడ్డు పై ఆందోళన, అనిల్, రాజేశ్‍ను పోలీసులు వెంటనే విడిచిపెట్టాలని టీడీపీ నేతల డిమాండ్, జొన్నలగడ్డలో నిన్న వైఎస్ విగ్రహం తొలగించిన దుండగులు,
వైఎస్ విగ్రహాన్ని వైసీపీ నేతలే మాయం చేశారని చదలవాడ అరవింద బాబు ఆరోపణ, టిడిపి నాయకులు పై పోలీసుల లాఠిచార్జ్, చదలవాడ అరవింద బాబుకు అస్వస్థత. పోలీసులకు టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, టీడీపీ కార్యకర్తలకు గాయాలు, గుంటూరు-నరసరావుపేట మధ్య భారీగా ట్రాఫిక్ జాం.
అక్రమ అరెస్ట్ లపై ప్రశ్నించిన అరవింద్ బాబు, ఇతర నేతల పై పోలీసులు దౌర్జన్యం చేయడం వారి వైఖరికి నిదర్శనం. టీడీపీ శ్రేణులపై వైసీపీ వారు దాడి చేస్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారు!? అస్వస్థతకు గురైన టీడీపీ నేతలను తరలించే అంబులెన్స్ పైనా దాడికి దిగడం వైసీపీ ఆరాచకానికి, పోలీసుల వైఫల్యానికి నిదర్శనం, ఘర్షణకు కారణమైన వైసీపీ కార్యకర్తలతో పాటు పోలీసుల పైన చర్యలు తీసుకోవాలి అని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.








Comments