top of page

ఉద్యోగుల ఉద్యమం.. రేపు సెల్‌ఫోన్‌ డౌన్‌

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 10, 2023
  • 1 min read

ఉద్యోగుల ఉద్యమం.. రేపు సెల్‌ఫోన్‌ డౌన్‌..

ree

తమ డిమాండ్ల సాధన కోసం మలిదశ ఉద్యమ కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. అందులో భాగంగా రేపు సెల్ ఫోన్‌ డౌన్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

ree

ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు.. ఏపీజేఏసీ రాష్ట్రకమిటి ఇచ్చిన మలిదశ ఉద్యమ కార్యచరణలో భాగంగా.. ఈనెల 11న మంగళవారం ఒక్కరోజు ప్రభుత్వ ఉద్యోగులంతా సెల్ ఫోన్ వినియోగించకుండా ఉద్యోగులలో ఉన్న ఆవేదనను, నిరసనను ప్రభుత్వానికి తెలియజేసేలా ఈ సెల్ డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page