చెన్నకేశవ స్వామి ఆలయంలో దశరా ఉత్సవాలు
- PRASANNA ANDHRA

- Sep 24, 2022
- 1 min read
Updated: Sep 26, 2022
చెన్నకేశవ స్వామి ఆలయంలో దశరా ఉత్సవాలు
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

ప్రొద్దుటూరు నందు వెలసిన శ్రీ మహాలక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు దశరా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నామని చైర్మన్ రామ సుబ్బారెడ్డి తెలిపారు. గడిచిన నలబై సంవత్సరాలుగా దశరా శరన్నవరాత్రుల ఉత్సవాలు రంగ రంగ వైభవంగా జరుపుతున్నామని, కాగా 40 సంవత్సరాల ఉత్సవ కమిటీ పూర్తి అయిన నేపథ్యంలో ఇక్కడి అమ్మావారికి ప్రత్యేక పూజలు, అలంకారాలు చేయనున్నామని, కేరళా వాయిద్యాల నడుమ, విభిన్న భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని, భక్తులు అమ్మవారిని దర్శించి పునీతలు కాగలరని ఆయన ఆకాంక్షించారు. ACN ఛానల్ నెంబర్ 6లో శ్రీ మహాలక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థాన లైవ్ ప్రోగ్రాం ప్రసారం కానున్నదని ప్రజలు వీక్షించ వలసిందిగా కోరారు. కార్యక్రమంలో దశరా ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.








Comments