top of page

తనిఖీలలో రూ 30 లక్షలు నగదు స్వాధీనం

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 2, 2023
  • 1 min read

తనిఖీలలో రూ 30 లక్షలు నగదు స్వాధీనం

నగదును స్వాధీనం చేసుకున్న సీఐ నరసింహారావు

ప్రసన్న ఆంధ్ర -రాజంపేట :


అర్బన్ సీఐ నరసింహారావు సరియైన పత్రాలు లేని రూ 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయన తెలిపిన వివరాలు మేరకు.. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్బన్ సీఐ నరసింహారావు ఫ్లయింగ్ స్క్వాడ్ తో గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా పోలి చెరువు కట్ట మీద టీ ఎన్ 05 సీసీ 7799 అనే నెంబర్ గల కారులో చెన్నై కు చెందిన వెంకటరమణ మరో ముగ్గురితో రాజంపేట కు చెందిన ఓ వ్యక్తి వద్ద స్థలం కొనేందుకు రూ 30 లక్షలు నగదు తీసుకుని వెళుతుండగా తనిఖీలలో గుర్తించి సరైన పత్రాలు లేనందున స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించి నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ కు అప్పగించడం జరిగిందని సీఐ నరసింహారావు తెలిపారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page