top of page

స్కూటర్ నీ ఢీకొన్న బస్సు

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Nov 1, 2023
  • 1 min read

ఒకరు మృతి,మరొకరికి గాయాలు


బస్సు ఢీకొని మృతి చెందిన

వెంకట సుబ్బరాజు


ree

చిట్వేలి మండలం బి కొత్తపల్లి గ్రామం ఎం రాచపల్లి క్రాస్ వద్ద బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు స్కూటర్ ను ఢీకొన్న సంఘటనలో ఇరువురి వ్యక్తులకు గాయాలు కాగా ఒకరు మరణించినట్లు మరొకరు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ree

చిట్వేలి ఏఎస్ఐ వెంగయ్య తెలిపిన వివరాల ప్రకారం రాజంపేట డిపోకు చెందిన AP39 UM 1443 బస్సు రాజంపేట నుండి నెల్లూరు కి వెళుతుండగా మండల పరిధి ఎం రాచపల్లి గ్రామానికి చెందిన చొక్కరాజు వెంకటసుబ్బరాజు(64),ఉమ్మలరాజు కనకరాజు (55) లు పల్సర్ మోటార్ బైక్ లో చిట్వేలికి వస్తున్న క్రమంలో ప్రధాన రహదారిలోకి ప్రవేశిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందనీ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వెంకట సుబ్బరాజును మెరుగైన చికిత్స కోసం తిరుపతి సిమ్స్ ఆస్పత్రికి హుటాహుటిన తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం సమయంలో మరణించారని తెలిపారు.


కనకరాజు తిరుపతి లో చికిత్స పొందుతున్నారన్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గురువారం పంచనామ నిర్వహిస్తామని ఏఎస్ఐ వెంగయ్య తెలిపారు. కాగా వివాద రహితుడు, గ్రామ కార్యక్రమాలలో ముందుండే వెంకటసుబ్బరాజు మరణం పై కుటుంబంలోనూ, గ్రామంలోనూ విషాద చాయలు అలుముకున్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page