top of page

వధువుని చూసి పరుగులు పెట్టిన వరుడు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 31, 2022
  • 1 min read

వధువుని చూసి పరుగులు పెట్టిన యువకుడు.. యువతి ఏం చేసిందంటే?


పెళ్లి పేరుతో పెళ్లికి ముందే ఒక బైక్‌, 50 వేలు కట్నం తీసుకున్నారు. మరి అమ్మాయి నచ్చలేదో ఏంటో తెలియదు గానీ పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంటే వాయిదా వేస్తున్నారు. ఏదో సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. ఆ అమ్మాయి కనబడితే పారిపోతున్నాడు. ఫైనల్‌గా అతన్ని పట్టుకుని పెళ్లి చేసుకుంది. ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. మెహకర్ గ్రామానికి చెందిన వ్యక్తికి.. మహులి గ్రామానికి చెందిన యువతికి పెద్దలు పెళ్లి కుదిర్చారు. మూడు నెలల క్రితమే నిశ్చితార్థం కూడా జరిగింది. ఎంగేజ్‌మెంట్‌ సమయంలో కట్న కానుకల గురించి కూడా మాట్లాడుకున్నారు. ఆ వ్యక్తికి ఒక బైక్‌, అలానే రూ. 50 వేలు కట్నంగా ఇచ్చారు. అయితే పెళ్లి తేదీ దగ్గర పడుతున్న ప్రతిసారీ వరుడి కుటుంబ సభ్యులు పెళ్లి వాయిదా వేస్తూ వస్తున్నారు. ఏదో ఒక వంక పెట్టి ముహూర్తం తేదీ మార్చమని కోరుతున్నారు. దీంతో వధువు, వధువు కుటుంబ సభ్యులు అసహనానికి గురయ్యారు.

ఒకరోజు ఆ యువతి తన తల్లిదండ్రులతో కలిసి మార్కెట్‌కు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కనిపించాడు. అతని దగ్గరకి వెళ్ళి తనని పెళ్లి చేసుకోమని కోరగా.. ఆ వ్యక్తి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అతను ఏం మాట్లాడకుండా పరుగులు పెట్టాడు. అతని వెనకే ఆ యువతి కూడా పరుగులు పెట్టింది. రోడ్ల మీద పరిగెడుతూ చివరకి అతన్ని పట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు రెండు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను పెళ్లికి ఒప్పించడంతో.. అక్కడే పోలీస్‌ స్టేషన్‌ పక్కనే ఉన్న గుడిలో యువతి, యువకుడు వివాహం చేసుకున్నారు. మరి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అన్న చందాన యువతి ఛేజ్‌ చేసి మరీ పెళ్లి చేసుకుంది..

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page