top of page

శంకర్ బాలాజిపై చర్యలు తీసుకోవాలి - సీపీఎం డిమాండ్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jun 8, 2023
  • 1 min read

బ్రహ్మంగారిమఠం ఫిట్ పర్సన్ శంకర్ బాలాజిపై చర్యలు తీసుకోవాలి - సీపీఎం డిమాండ్

ree
ree

ఎండోమెంట్ అధికారి గా బ్రహ్మంగారి మఠం దేవస్థానం ఫిట్ పర్సన్ గా బాధ్యతగల వృత్తిలో ఉండి దేవాలయ నియమ నిబంధనలను కాపాడవలసిన అధికారి దేవాలయ నియమ నిబంధనలను అతిక్రమించి శ్రీ వీరబ్రహ్మం గారి గర్భగుడిలో మరో అధికారితో కలసి పోటోలు దిగిన పిట్ పర్సన్ శంకర్ బాలాజీ పై ఉన్నత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మరో అధికారి ఎవరన్నది తేల్చి అతని మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.శివకుమార్ డిమాండ్ చేశారు.

ree

దేవాలయాల్లోనీ గర్బ గుడిలో పోటోలు వీడియోలు తియకూడదన్న విషయం సాధారణమైన వ్యక్తులకు కూడా తెలుసని అటువంటిది ఒక దేవస్థాన అధికారిగా వున్న వ్యక్తి నిబంధనలను అతీక్రమించి పోటోలు తియించుకునే సాహసం చేశాడంటే అతని విచ్చలవిడి తనం, లెక్కలేని తనానికి నిదర్శనమని వెంటనే పై అధికారులు ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ పై చర్యలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు.

ree


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page