top of page

తృటిలో తప్పిన పడవ ప్రమాదం ప్రయాణికులు సురక్షితం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 4, 2022
  • 1 min read

గుడిమెట్ల లో అనధికారికంగా నాటు పడవలు రవాణా, వివరాల్లోకి వెళితే తెల్లవారుజామున చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం కృష్ణా నది నుండి తాడువాయి గ్రామానికి అనధికారికంగా నాటు పడవలు రవాణా చేస్తున్నారు. మధ్యలో నాటు పడవ ఆగిపోవడంతో కొంతసేపు ప్రయాణికులు భయాందోళనకు గురి అయినట్లు సమాచారం.. వెంటనే నాటు పడవ నిర్వాహకులు అప్రమత్తమై పడవను ఒడ్డుకు చేర్చారు లేకుంటే పెను ప్రమాదం జరిగేదని ప్రయాణికులు భయాందోళన చేస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో బల్లకట్టు మునిగి చాలా మంది ప్రాణాలు కృష్ణా నదిలో కలిశాయి. మరల లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో నే కనీసం లైఫ్ జాకెట్లు కూడా లేకుండా నాటు పడవలు తిప్పుతున్నారు ఇంత జరుగుతున్నా జిల్లా కలెక్టర్ , సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ లేదా జిల్లా ఎస్పీ ఎవరు వీటి పై చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు బాధ పడుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత హడావుడి చేసే దానికంటే ప్రమాదం జరగకుండా చూడాలని ప్రభుత్వ అనుమతులు లేకుండా తిరుగుతున్న పడవలను సీజ్ చేసి ఇ తగు చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page