top of page

గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో పేలుడు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Oct 8, 2022
  • 1 min read

గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో పేలుడు..

వణికిపోయిన పోలీసులు, జనాలు

ree

చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌ లో పేలుడు కలకలంరేపింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో వెనుక వైపునా వేకువజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడుతో శబ్ధం వచ్చింది. ఈ ఘటనలో అద్దాలు, తలుపులు, కిటీకీలు.. వివిధ కేసుల్లో పట్టుబడిన కార్లు, బైకులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. నాటు బాంబు పేలిందా అని భావించారు. అయితే క్వారీల్లో ఉపయోగించే జిలిటెన్ స్టిక్స్ పేలాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఈ పేలుడు ఘటనతో పోలీసులు, జనాలు భయాందోళనలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page