బిజెపి రూరల్ అధ్యక్షునిగా గోపిరెడ్డి మురళీకృష్ణ రెడ్డి
- EDITOR

- Nov 23
- 1 min read
ప్రొద్దుటూరు బిజెపి రూరల్ అధ్యక్షునిగా గోపిరెడ్డి మురళీకృష్ణ రెడ్డి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డి ఆదేశాల మేరకు, గడచిన 20 సంవత్సరాలుగా బిజెపి పార్టీలో సేవలను గుర్తించి ప్రొద్దుటూరు మండల పరిధిలోని దొరసాని పల్లె గ్రామానికి చెందిన గోపిరెడ్డి మురళి కృష్ణా రెడ్డి ని బిజెపి రూరల్ అధ్యక్షునిగా ఎన్నుకున్నట్లు, అలాగే కమిటీ సభ్యులను కూడా ఎనుకున్నట్లు జిల్లా బిజెపి జనరల్ సెక్రెటరీ కొనేటి కృష్ణ ప్రదీప్ రెడ్డి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తూ, నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మురళి కృష్ణా రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షునికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజులలో పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలను కలుపుకొని పోయి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.








Comments