top of page

రైతు పథకాలు నిర్వీర్యం చేసిన నాటి వైసిపి ప్రభుత్వం - వంగల శశిభూషణ్ రెడ్డి

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 28
  • 2 min read

రైతు పథకాలు నిర్వీర్యం చేసిన నాటి వైసిపి ప్రభుత్వం - వంగల శశిభూషణ్ రెడ్డి

ree

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


రాష్ట్రంలో రైతులను దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసిపి ప్రభుత్వమేనని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో రైతాంగాన్ని విస్మరించి రైతులను నట్టేట ముంచారని రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శేషు భూషణ్ రెడ్డి దాటుగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం స్థానిక వైఎంఆర్ కాలనీలోని బిజెపి కార్యాలయం నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో శశిభూషణ్ రెడ్డి మాట్లాడుతూ, జులై 8వ తేదీని రైతాంగ దినోత్సవం గా ప్రకటించిన నాటి వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో ధరల స్థిరీకరణ నిధి ని ఏర్పాటు చేస్తామని రైతులకు గిట్టుబాటు ధర రాణి పక్షంలో బడ్జెట్ నందు 300 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కేటాయించి రైతులను ఆదుకుంటామని చెప్పి వారిని నట్టేట ముంచారని అన్నారు. ప్రత్యేక మూడు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి కింద జమ చేయవలసిన ప్రభుత్వం బడ్జెట్ నందు నిధి చెల్లించకపోగా రైతుల ఖాతాలలో కూడా జమ చేయలేదని గుర్తు చేశారు. కేవలం కొద్ది మంది రైతులకు మాత్రమే ధరల స్థిరీకరణ నిధి జమ చేసి మిగతా రైతులకు మొండిచేయి చూపించారని అన్నారు. రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలలో పార్టీ కల్చర్ ద్వారా పండ్లు ఫలాల సాగు కొనసాగుతుందని గత వైసిపి ప్రభుత్వం హయాంలో రాయలసీమ నందు హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తామని ఇక్కడి రైతులను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. గడచిన మూడు సంవత్సరాలుగా బిజెపి కిసాన్ మోర్చన ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు రాష్ట్రవ్యాప్తంగా చేపడితే రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సామాగ్రిని పంపిణీ చేశారని, ఇందులో కూడా రైతులకు అన్యాయం చేస్తూ 90% గా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీనీ 70 శాతానికి తగ్గించి రైతులకు అందించారన్నారు.


రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 90% సబ్సిడీతో రైతులకు అందులోనూ చిన్న కారు సన్న కారు ఎస్సీ రైతులకు నూరు శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇవ్వటం జరిగిందని ఆయన తెలిపారు. ఇక ధాన్యం కొనుగోలు విషయానికి వస్తే వారం రోజుల లోపు రైతులకు బకాయిలు కూటమి ప్రభుత్వం జమ చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు సబ్సిడీలు రైతులకు అందిస్తూ వారికి చేరువ అవుతోందని, అయితే నాటి ప్రభుత్వం కేంద్ర పథకాలకు రాష్ట్రం నుంచి అందించవలసిన ప్రోత్సాహకాన్ని అందించకపోవడంతో పథకాలు రైతులకు అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఫసల్ యోజన పథకం కూడా ఇలాగే నిరుపయోగంగా మార్చే ప్రయత్నాన్ని నాటి వైసిపి ప్రభుత్వం చేసిందని ఆరోపించారు.


కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి, మాజీ రాష్ట్ర కోశాధికారి సి వి జయలక్ష్మి, కార్యదర్శి కంబగిరి, ప్రొద్దుటూరు టౌన్ అధ్యక్షులు వంకదార నరేంద్ర, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నా మోహన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు ఎన్ కుమారి, బిజెపి నాయకురాలు రొటికాడి రెడ్డెమ్మ, శివనాగిరెడ్డి, పలువురు బిజెపి నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page