top of page

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా డా. బి.ఆర్ అంబెడ్కర్ 131వ జయంతి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 14, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ 131వ జయంతి సందర్బంగా నేడు బీజేపీ వై.ఎస్.ఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్రె శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటిష్టమయిన భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ ప్రపంచ మేధావి అని కొనియాడారు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు నేడు దేశ వ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారని, అలాంటి వ్యక్తి మన భారత దేశంలో పుట్టటం అదృష్టమని కీర్తించారు. ప్రస్తుతం దేశంలో వెనుకపడిన వర్గాలకు ఆశించిన స్థాయిలో సంస్కరణలు జరగలేదని, దీనిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్రుష్టి సారించిందని, బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారాలు చేపట్టటమే బీజేపీ ముందున్న లక్షమని, త్వరలో రిజర్వేషన్లు కట్టుదిట్టం చేసి డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు.

ree

ఈ కార్యక్రమానికి వై.ఎస్.ఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి గొర్రె శ్రీనివాసులు, పట్టణాధ్యక్షులు పి .సుబ్రహ్మణ్యం, మండలాధ్యక్షుడు బోరెడ్డి సుధాకర్ రెడ్డి, సీనియర్ బీజేపీ నాయకులు పల్లె రఘురామి రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page