top of page

సాయి లోకేష్ కృషికి దక్కిన ఫలితం.. అచట ఆగనున్న రైల్లు

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 11, 2022
  • 1 min read

సాయి లోకేష్ కృషికి దక్కిన ఫలితం. స్పందించిన కేంద్రమంత్రి.


---నందలూరు, ఓబులవారిపల్లెలో రైల్వే స్టేషన్లలో ఆగనున్న పలు రైల్లు.

---రెండు మండలాల ప్రజల నుంచి అభినందనలు.


ree

నందలూరు ఓబులవారిపల్లె రైల్వే స్టేషన్లలో నాలుగు ఎక్స్ప్రెస్ రైలు ఆపడానికి రైల్వే మంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు రాజంపేట బిజెపి రాష్ట్ర రాజకీయ రాజకీయ సలహాదారులు సాయి లోకేష్ తెలిపారు. సోమవారం రాజంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ హరిప్రియ తిరుమల ఎక్స్ప్రెస్ నందలూరు లోను ఓబులవారిపల్లెలో రాయలసీమ హరిప్రియ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగనున్నట్లు తెలిపారు 14వ తేదీ నుంచి నందలూరు 15వ తేదీ నుంచి ఓబులవారిపల్లి రైల్వే స్టేషన్లో ఈ రైల్లు ఆగుతాయన్నారు.


జూన్ 23వ తేదీన రైల్వే మంత్రి అశ్విని విష్ణవ్ ను కలిసి వినతి పత్రం సమర్పించగా ఆయన స్పందించి ఈ రైళ్లు ఆపడానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వారికి సాయి లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.


ఇరు మండలాల ప్రజా అవసరాలను గుర్తించి సంబంధితశాఖ మంత్రి తో చర్చించి సత్ఫలితాన్ని సాధించిన బిజెపి నాయకులు సాయి లోకేష్ కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సాయి లోకేష్ ను జడ్పిటిసి మాజీ సభ్యులు షబ్బీర్ అలీ సన్మానించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page