ప్రొద్దుటూరులో బీజేపీ సంబరాలు
- PRASANNA ANDHRA

- Mar 10, 2022
- 1 min read

భారతదేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బిజెపి విజయ దుందుభి మోగించిన సందర్భంగా ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం లోని పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు ఆధ్వర్యంలో శివాలయం సెంటర్ వద్ద, బీజేపీ కార్యాలయం వద్ద, పటాకులు పేల్చారు. అనంతరం స్వీట్లు పంచి సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. బిజెపి నాయకత్వం లో భారతదేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లుతుంది అని శ్రీనివాసులు తెలిపారు. త్వరలో రాబోయే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించి అధికారం లోకి వస్తుందని వివరించారు . ఈ సంబరాల్లో పట్టణ అధ్యక్షుడు సుబ్రమణ్యం, సోషల్ మీడియా జిల్లా ఇంచార్జి గొర్రె కృష్ణ , పట్టణ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ,రూరల్ మండల కార్యదర్శి ప్రకాష్ ,వార్డు ఇంచార్జ్ లు సుబ్బయ్య, దేవ భూషణం, పుల్లయ్య, రాము , సంతోష్ యువమోర్చా నాయకుడు సురేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.








antena proddatur BJP cader