వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు
- PRASANNA ANDHRA

- Oct 25, 2023
- 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు
మానవసేవే మాధవ సేవ అంటూ వృద్ధాశ్రమంలో హోమస్ పేట చౌడమ్మ ఆర్చి వద్ద ఉన్న దీప్తి లాబ్ ఇంచార్జి తాటికొండ శరత్ కుమార్ జన్మదిన వేడుకలు. మదర్ థెరిసా వృద్ధాశ్రమంలోని వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి మధ్యాహ్నం భోజనం అందించిన శరత్. వృద్ధాశ్రమంలో తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అని, వృద్ధులు తన తల్లితండ్రుల లాంటివారు అని దేవుని ఆశీస్సులు పెద్దల ఆశీస్సులు తనపై ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయుష్ తో జీవించాలని వృద్దులు శరత్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరస్సా స్టాఫ్ మెంబర్స్, శరత్ కుటుంబ సభ్యులు, మిత్రులు పాల్గొన్నారు.









Comments