విభజన సమస్యలపై నేడు కీలక సమావేశం
- PRASANNA ANDHRA

- Jan 12, 2022
- 1 min read
విభజన సమస్యలపై నేడు కీలక సమావేశం జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన వివాదాలు సహా సంబంధిత అంశాలపై కేంద్ర హోంశాఖ చర్చించనుంది.
దృశ్యమాధ్యమం ద్వారా రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమీక్షించనున్నారు. సింగరేణితో పాటు అనుబంధ సంస్థ ఆప్మెల్, విద్యుత్ బకాయిలు, దిల్లీలోని ఏపీ భవన్ విభజన, సంస్థల విభజన సహా ఇతర అంశాలు చర్చకు తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజనాంశాలతో పాటు విభజన చట్టంలోని అంశాలపై ఇవాళ కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమావేశం కానున్నారు. మొదట దిల్లీలో ప్రత్యక్ష సమావేశం అనుకున్నప్పటికీ కొవిడ్ కేసుల నేపథ్యంలో సమావేశాన్ని దృశ్యమాధ్యమం ద్వారా నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ తొమ్మిది అంశాలను ఎజెండాలో పొందుపర్చింది. విభజన చట్టం తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజన, విద్యుత్ బకాయిలు, ఏపీ-ఎస్ఎఫ్సీ విభజన, సింగరేణి కార్పొరేషన్‌తో పాటు అనుబంధ సంస్థ ఆప్మెల్ విభజన, దిల్లీ ఏపీ భవన్ విభజన, విభజన చట్టంలో పొందుపర్చిన ప్రకారం పన్ను బకాయిలు, బ్యాంకు డిపాజిట్లలో మిగిలిన నగదు పంపకాల అంశాలు ఎజెండాలో ఉన్నాయి.









Comments