top of page

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

  • Writer: EDITOR
    EDITOR
  • May 17, 2023
  • 1 min read

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌...

ree
ree

మాజీ మంత్రి, తెదేపా నేత భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 307 సెక్షన్‌ కింద ఆళ్లగడ్డలో ఆమెను అరెస్ట్‌ చేసి పాణ్యం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు అఖిలప్రియ, తెదేపా నేత ఎ.వి.సుబ్బారెడ్డి వర్గాలు కొత్తపల్లి గ్రామం దగ్గర భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి.

ree

ఇరువర్గాల మధ్య కొంతకాలంగా వర్గపోరు, విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అఖిలప్రియ వర్గీయుడు ఎ.వి.సుబ్బారెడ్డిని కొట్టడంతో ఆయన ముక్కు నుంచి రక్త కారింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత అక్కడే ఉన్న అఖిలప్రియ, ఇతర నాయకులు, పోలీసు అధికారులు క్షణాల్లో జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం అప్పటికి సద్దుమణిగింది. ఈ ఘటన నేపథ్యంలోనే అఖిలప్రియను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page