భావన సహకార గృహ నిర్మాణ సంఘము - నూతన పాలకవర్గ సభ్యులు
- PRASANNA ANDHRA

- Jul 28, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

ప్రొద్దుటూరు భావన సహకార గృహ నిర్మాణ సంఘము లిమిటెడ్ పాలకవర్గ సభ్యులుగా ఆరవేటి ఆదినారాయణ, ఎగువపల్లె రామకృష్ణ యాదవ్, ఎన్. శివ తులసి, గోపిరెడ్డి ధనుంజయ, గోపిరెడ్డి రమణయ్య, జి. రాజశేఖర్ రెడ్డి, పామిలేటి హరి బాబు, బి. నాగరాజు, బొంతల నాగరాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు, ది భావన సహకార గృహ నిర్మాణ సఙ్గహం అసిస్టెంట్ రిజిస్ట్రార్ మరియు ఎన్నికల అధికారి ఆర్. చిన్న కృష్ణా రెడ్డి తెలియచేసారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకార సభకు ముఖ్య అతిధులుగా నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఎన్నికయిన సభ్యులను అభినందించగా, సభ్యులు ఎమ్మెల్యే రాచమల్లును, వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి ని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాచమల్లు, వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి, సీనియర్ వైసీపి నాయకులు కాకర్ల నాగ శేషా రెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై నూతన పాలకవర్గ సభ్యులను అభినందించారు.








Comments