top of page

నీట్-2023 ఫలితాల్లో బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థుల జయకేతనం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jun 16, 2023
  • 1 min read

ఆలిండియా నీట్-2023 ఫలితాల్లో జయకేతనం ఎగురవేసిన బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థులు

ree

కాజీపేట సమీపంలో విద్యే ధ్యేయంగా స్థాపించబడిన భీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థులు నీట్-2023 ఫలితాల్లో , ఆలిండియా స్థాయిలో అమోఘమైన ప్రతిభ కనబరచారు. ఆలిండియా 247 వ ర్యాంకుతో పి. చెండ్రాయుడు అనే విద్యార్థితో పాటు, పరీక్ష రాసిన ప్రతి ఇద్దరిలో ఒకరు మెడికల్ సీట్ సాధించి రాష్ట్రస్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో కూడా కళాశాల పేరును నిలబెట్టారు. అంతే కాకుండా నిన్న విడుదలైన AP EAPCET ఫలితాల్లో కూడా పి. చెండ్రాయుడు 53వ ర్యాంకు,  వి. ఓబుల్ రెడ్డి 103వ ర్యాంకు సాధించి రాయలసీమలోనే నెంబర్ -1 కళాశాల గా నిలబెట్టారు.

ree

ఈ సందర్భంగా కరస్పాండెంట్ బీరం సుబ్బారెడ్డిగారు, చైర్పర్సన్ సరస్వతమ్మ గార్లు మాట్లాడుతూ దేశంలోనే నిష్ణాతులైన అధ్యాపకులచే నాణ్యమైన శిక్షణ అందిస్తూ ఇంతటి అద్భుతమైన ఫలితాలను సాధించామని తెలిపారు.ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు.


బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కళాశాల డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్ మాట్లాడుతూ కళాశాలలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ జూన్ 19వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు. నీట్-2023 ఫలితాల్లో సీట్ రాని విద్యార్థులకు ఇది ఒక గొప్ప సదవకాశమని, కళాశాలలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే తప్పకుండా మెడికల్ సీట్ సాధిస్తారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాల ప్రిన్సిపల్ శ్వేత గారు, కళాశాల ప్రిన్సిపల్ హేమచందర్ గారు,అధ్యాపకులు పాల్గొన్నారు.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page