top of page

మైనారిటీల ద్రోహి జగన్ రెడ్డి- బత్యాల

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 24, 2022
  • 1 min read

మైనారిటీల ద్రోహి జగన్ రెడ్డి- బత్యాల

ree

రాజంపేట, వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి ముస్లిములను ఊచకోత కోస్తున్నాడని, జగన్ రెడ్డి ముస్లింల ద్రోహి అని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు పేర్కొన్నారు. ముస్లిం సమాజం పై జరుగుతున్న దాడులకు నిరసనగా శనివారం బత్యాల చెంగల్ రాయుడు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు స్థానిక టిడిపి కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు.

ree

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బత్యాల మాట్లాడుతూ నరసారావు పేటలో మైనారిటీ స్థలం విషయంలో ప్రశ్నించినందుకు వైసీపీ మూకలు షేక్ ఇబ్రహీం ను అత్యంత దారుణంగా హత్య చేశారని, రహమత్ అలీ ని తీవ్ర గాయాల పాలు చేశారని తెలిపారు. మైనారిటీల భూములను కబ్జా చేస్తున్నా ప్రశ్నించకూడదా., ప్రశ్నిస్తే హత్యలు చేస్తారా అని నిలాదీశారు. జగన్ రెడ్డి మైనారిటీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారని, పథకాలలో ముస్లింలకు భారీ కోత పెట్టారని ఆరోపించారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, ముఖ్యమంత్రి సొంత జిల్లా ఐన కడపలోనే వక్ఫ్ భూములు ఆక్రమించుకున్న దుస్థితి నేడు ఎదురైందని అన్నారు. ముస్లింల అభ్యున్నతి కోసం గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన పథకాలన్నింటినీ జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. జగన్ రెడ్డి కేవలం ముస్లింలను ఓటు బ్యాంకు గానే చూస్తూ వారి సంక్షేమాన్ని గాలికి వదిలేసారని ఆరోపించారు.

ree

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నర సంవత్సరంలో ముస్లిములు పైన 46 దాడులు జరిగాయని, దాదాపు పదిమంది మైనారిటీలు హత్య చేయబడ్డారని అన్నారు. ఈ దాడులు, హత్యలకు పాల్పడిన వైసిపి నాయకులపై ఇప్పటివరకు జగన్ రెడ్డి ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. ముస్లింలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయని, వారిపై జరుగుతున్న హత్యాకాండ కు వ్యతిరేకంగా ప్రతిఒక ముస్లిం జగన్ రెడ్డిని ప్రశ్నించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ree

ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు సుబ్బ నరసయ్య నాయుడు, తెలుగు మహిళ అనసూయమ్మ, టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రేవూరి వేణుగోపాల్, మైనారిటీ నాయకులు అబూబకర్, రాంనగర్ నరసింహ, జడ శివ, జ్యోతి శివ తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page