
కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఎటిఎం ప్రారంభం
- PRASANNA ANDHRA

- Jan 5, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు స్థానిక YMR కాలనీ లోని కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఎటిఎం సేవలను ఈరోజు అప్కోబ్ చైర్మన్ శ్రీమతి మల్లెల ఝాన్సీ ప్రారంబించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రొద్దుటూరు నందు ఉన్న రెండు శాఖలలో బ్యాంకు ఉదోగస్థుల పనితీరును ప్రశంసించారు, మరో కొత్త శాఖ ప్రొద్దుటూరులో త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు, రైతులకు, చిన్న వ్యాపారస్తులకు వారి ఆర్ధిక అవసరాలు తగ్గట్టు బ్యాంకు నుండి ఋణం పొందవచ్చని, వ్యాపార వాణిజ్య పర్సనల్, వాహన రుణాలు బ్యాంకు నుండి పొందవచ్చని ఈ సందర్బంగా ఆమె తెలియచేసారు.








Comments