చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రొద్దుటూరు కోర్టుకు హాజరు
- PRASANNA ANDHRA

- Mar 28, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో ప్రొద్దుటూరు కోర్టుకు నేడు హాజరయ్యాడు. గతంలో ప్రొద్దుటూరుకు చెందిన పలువురు సినీ ఫైనాన్షియర్స్ వద్ద నుంచి దాదాపు పది కోట్ల రూపాయలు డబ్బు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో సదరు వ్యాపారస్తులు ప్రొద్దుటూరు సివిల్ సెషన్స్ కోర్టు నందు చెక్ బౌన్స్ కేసులు వేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ తాను ఎవరికీ అప్పు లేనని, తన చెక్ బుక్ పోయిందని ఆ చెక్స్ ని తనకు సరిపోని కొంతమంది వ్యక్తులు చెక్కు బౌన్స్ చేసి కావాలనే కేసులు వేశారని తెలిపారు. గతంలో కూడా పలు మార్లు చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ ప్రొద్దుటూరు కోర్ట్ కు హాజరయ్యాడు.








Comments