మహిళా లెక్చరర్‌పై హత్యాయత్నం - సొంత భర్తే గొంతు కోసిన మైనం
- PRASANNA ANDHRA

- Nov 17, 2022
- 1 min read
మహిళా లెక్చరర్‌పై హత్యాయత్నం - సొంత భర్తే గొంతు కోసిన మైనం

అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది, ఆర్ట్స్ కళాశాలలో మహిళా లెక్చరర్‌పై హత్యాయత్నం జరిగింది. కళాశాలలో కామర్స్ బోధిస్తున్న ప్రొఫెసర్ సుమంగళిని ఆమె భర్త గొంతు కోశాడు. లెక్చరర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








Comments