అట్లూరు మండలంలో పేకాట రాయుళ్ళు అరెస్ట్
- PRASANNA ANDHRA

- Mar 19, 2022
- 1 min read
అట్లూరు క్రైమ్ రిపోర్టర్ :

అట్లూరు మండలంలోని పేకాట ఆడుతున్న స్థావరాల పై సిబ్బందితో దాడులు నిర్వహించి ఏడుగురుని అదుపులోకి తీసుకోవడం జరిగిందని అట్లూరు SI T.V.నాగ చిరంజీవి తెలియజేయడం జరిగింది. ఆకుతోట పల్లె గ్రామ సమీపాన పొలాల్లో పేకాట ఆడుతున్న వారి దగ్గర నుంచి 8400 రూపాయలు స్వాధీనం చేసుకొని వారిని అరెస్టు చేయడం జరిగిందని, పేకాట ఆడుతున్న వారు అట్లూరు క్రాస్ రోడ్డు, గాండ్లపల్లి వాసులుగా గుర్తించామని SI T.V నాగ చిరంజీవి తెలియచేశారు. పోలీస్ సిబ్బంది సభాపతి, నాగేంద్ర తదితరులు ఈ దాడుల్లో పాల్గొన్నారు.








Comments