ఆర్యవైశ్య సభ 133వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశం
- PRASANNA ANDHRA

- Sep 3, 2023
- 1 min read
ఆర్యవైశ్య సభ 133వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశం


కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు పట్టణంలో ఆర్యవైశ్య సభ 133వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశం నేడు నిర్వహించారు. స్థానిక శ్రీ కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో సభ అధ్యక్షుడు బుసెట్టి రామ్మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించారు. మొదటగా అధ్యక్షుడు రామ్మోహన్ ప్రసంగం అనంతరం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదికను చదివి వినిపించారు, అనంతరం గత సంవత్సరం దసరా ఉత్సవాలకు సంబంధించి జమ కర్చులు సభ యొక్క జమా ఖర్చుల గురించి అధ్యక్షులు సభ్యులకు వివరించారు. 2023 సంబంధించి దసరా మహోత్సవానికి ఆగు ఖర్చుల గురించి ఇతర విషయాలపై అధ్యక్షులు సభ్యులు చర్చించారు.









Comments