ఏపీ.ఆర్.డి.సి డైరెక్టర్ గా గుల్జార్ భాషా
- PRASANNA ANDHRA

- Nov 24, 2022
- 1 min read
ఏపీ.ఆర్.డి.సి డైరెక్టర్ గా గుల్జార్ భాషా

ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గా వైయస్సార్సీపి సీనియర్ నాయకులు గండికోట గుల్జార్ భాషను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా, రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రహదారుల అభివృద్ధి సంస్థలో సభ్యులుగా రాష్ట్ర నలుమూలల నుంచి 14 మంది డైరెక్టర్ లకు పదవులు లభించాయి.

వీరిలో అన్నమయ్య జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. చిట్వేలి మండలం నుంచి ఒకరిని రాజంపేట మండలం నుంచి గుల్జార్ భాషను ఎన్నుకోవడం జరిగింది. వీరికి ఈనెల 28వ తేదీన విజయవాడలోని ఎం.జి రోడ్డు నందలి ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయం లో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. వీరు ఈ పదవిలో రెండు సంవత్సరాలు పాటు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గుల్జార్ భాష మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినవారిని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ మరువరని తెలిపారు. తాను ఎప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, స్థానిక శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి కోసం పనిచేస్తానని అన్నారు. తనకు డైరెక్టర్ పదవి రావడానికి కారణమైన ఎమ్మెల్యే మేడా కు, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.








Comments