వాలంటీర్లు సత్కార సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
- PRASANNA ANDHRA

- May 19, 2023
- 1 min read
ప్రజలకు ప్రభుత్వానికి వారధులైన వాలంటీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు
రాష్ట్ర సంక్షేమ సారథులు వాలంటీర్లే
రాష్ట్ర వ్యాప్తంగా 243 కోట్లతో.. 2.33 లక్షల వాలంటీర్లకు నగదు పురస్కారాలు
లంచాలు, వివక్ష లేని వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబుకు కడుపుమంట
వాలంటీర్లు సత్కార సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు


వాలంటర్లే రాష్ట్రానికి నిజమైన సంక్షేమ సారథులు.. ప్రభుత్వుం తలచిన మంచిని ప్రతి గడపకు వాస్తవ రూపంలో తీసుకెళ్లి ఆప్యాయంగా లబ్ధిదారులకు చేరుస్తున్న వాలంటీర్లకు నా సంపూర్ణ మద్ధతు. లంచాలు, వివక్ష లేని వాలంటీర్ వ్యవస్థ గత టీడీపీ ప్రభుత్వంలోని జన్మభూమి కమిటీల గంజాయి వనం స్థానంలో ఎదిగిన ఓ తులసి వనం. ప్రజలకు మంచి చేయడం కోసం అడుగులు వేస్తున్న వాలంటీర్లే ఈ జగన్ సైన్యమని గర్వంగా చెబుతున్నా.. సీఎం జగన్

ఒకటో తేదీన సర్యోదయానికి ముందే వృద్ధుల గడపకు పెన్షన్ కానుక ఇవ్వడంతో పాటు ప్రతి ప్రభుత్వ పథకాన్ని లంచాలు, వివక్ష లేకుండా లబ్ధిదారులకు చేరుస్తూ వారి కళ్లలో ఆనందం నింపుతున్న వాలంటీర్ల సేవలు అద్భుతమని సీఎం జగన్ కొనియాడారు.










Comments