top of page

ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఓపెన్ ఛాంపియన్ రాపాక రమేష్ యాదవ్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jun 8, 2022
  • 1 min read

పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర రిపోర్టర్ వీర

ree

ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఓపెన్ ఛాంపియన్ షిప్-2022 లో 105కేజీల బెంచ్ ప్రెస్ విభాగములో మొదటి స్థానం సాధించిన యువకుడిని అభినందించిన 75వ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మిబాయి వెంకట రమణా రెడ్డి దంపతులు.

ఇటీవల విశాఖపట్నం లో నిర్వహించిన AP స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఓపెన్ ఛాంపియన్ షిప్-2022 లో 105కేజీల బెంచ్ ప్రెస్ విభాగములో మరియు 165కేజీల డెడ్ లిప్ట్ విభాగములో మొదటి స్థానం సాధించిన 75వ వార్డు యువకుడు రాపాక రమేష్ యాదవ్ ను 75వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి పులి లక్ష్మిబాయి వెంకట రమణా రెడ్డి దంపతులు ఈ రోజు అభినందించారు.


ఈ సందర్భములో వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యం కొరకు బాగా ఉపయోగ పడతాయి అని క్రీడలలో ప్రతిభ చూపిస్తే మంచి స్థాయిని, సంపాదనను, ఉద్యోగాలను సాధించే అవకాశాలు పుష్కలముగా ఉన్నాయని యువకులు క్రీడలపై దృష్టి పెట్టాలని ఆన్నారు. రమేష్ యాదవ్ ఇంకా మంచి ఉన్నత స్థితికి ఎదగాలని దానికొరకు తమ వంతు సహకారం సహకారం ఎప్పుడూ ఉంటుందని వారు తెలిపారు.


ఈ కార్యక్రమంలో దొమ్మేటి అప్పారావు ,దోమ్మేటి సోము నాయుడు శ్రిముషిరి శ్రీనివాస రావు, దోమ్మేటి పెరుమాళ్, అప్పల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page