top of page

అన్నమయ్య భక్త బృందంచే 17వ తిరుమల పాదయాత్ర

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 20, 2023
  • 1 min read

అన్నమయ్య భక్త బృందం 17వ తిరుమల పాదయాత్రకు స్వాగతం పలికిన పోతు గుంట రమేష్ నాయుడు.

ree

గత 17 సంవత్సరాలుగా అన్నమయ్య భక్త బృందం బోయినపల్లి నుండి భీమిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తిరుమల మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా రాజంపేట పాత బస్టాండ్ కోడలి నందు రాజంపేట అసెంబ్లీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోతు గుంట రమేష్ నాయుడు మిత్ర బృందంతో కలిసి భక్త బృందానికి స్వాగతం పలకడం జరిగింది అనంతరం వారితో కలిసి పాదయాత్రగా సాగడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా నిర్విరామంగా స్వామి వారి పైన భక్తితో ఈ పాదయాత్ర చేస్తున్న వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు ప్రజల్లో భక్తి భావన పెంపొందించడానికి ఆధ్యాత్మిక చింతన కలగడానికి ఇది ఎంతో దోహదపడుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎన్ రమేష్ నాయుడు, సాయి లోకేష్, పట్టుపోగుల ఆదినారాయణ, జీకే నాగరాజు, తోట నగేష్, స్థానిక ప్రజలు, భక్త బృందం పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page