హోటల్ యజమానిపై హత్యాయత్నం
- PRASANNA ANDHRA

- Apr 26, 2022
- 1 min read
విజయవాడ, ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని నరేంద్ర, వర్కింగ్ పార్టనర్ వెంకటేశ్వరరావు ల పై హత్యాయత్నం. హోటల్ నుండి ఇంటికి వెళుతున్న సమయంలో బైక్ పై ఫాలో అయిన అజ్ఞాత వ్యక్తులు, అశోక్ నగర్ సమీపంలో బీర్ బాటిల్ తో తల పై బాదిన గుర్తు తెలియని వ్యక్తులు, దాడి నుండి తృటిలో తప్పుకున్న నరేంద్ర, వెంకటేశ్వరరావు తలకి బలమైన గాయం. పెనమలూరు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు. శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ యజమాని మనోహర్, అతని స్నేహితుడు వేగె వెంకటేశ్వరరావు పై పోలీసులు కు ఫిర్యాదు, శ్రీ ఆంజనేయ హోటల్ నిర్వహణలో నరేంద్ర ను, మనోహర్ మోసం చేశాడని ఆరోపణ. ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్ పేరు తొలగించాలంటూ కొంతకాలంగా బెదిరింపులు, ట్రేడ్ మార్క్ తో హోటల్ నడుపుకుంటున్న నరేంద్ర, బెదిరించినా వినవా అంటూ హత్యాయత్నం. జూలపల్లి మనోహర్, వేగే వెంకటేశ్వరరావు ల పై చర్యలు తీసుకోవాలని పోలీసులు ను కోరిన బాధితుడు నరేంద్ర, విచారణ చేపట్టిన పెనమలూరు పోలీసులు.








Comments