స్టోర్ డీలర్లు బెదిరిస్తున్నారు - అంగన్వాడీ కార్యకర్తలు
- PRASANNA ANDHRA

- Aug 29, 2023
- 1 min read
స్టోర్ డీలర్లు బెదిరిస్తున్నారు - అంగన్వాడీ కార్యకర్తలు

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
అంగన్వాడి కేంద్రాలకు అందించవలసిన బియ్యం, కందిపప్పు, నూనె అలాట్మెంట్ అయిన విధంగా స్టోర్ డీలర్లు సరఫరా చేయడం లేదని, మంగళవారం ఉదయం అంగన్వాడీ కార్యకర్తలు ప్రొద్దుటూరు ఎమ్మార్వో నజీర్ అహ్మద్ కు వినతిపత్రం అందజేశారు. ప్రొద్దుటూరు అంగన్వాడి వర్కర్లకు స్టోర్ ల ద్వారా సరఫరా అయ్యే బియ్యం, కందిపప్పు, నూనె అలాట్మెంట్ అయిన విధంగా తమకు స్టోర్ డీలర్లు సరఫరా చేయడం లేదని, అయితే సూపర్వైజర్లు ఆన్లైన్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం తమ రిజిస్టర్ లలో స్టాకును నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారని, స్టోర్ డీలర్లు తమను బెదిరిస్తున్నట్లు, డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారని, అంగన్వాడీ కేంద్రాలకు సరిగా సరుకులు సరపరా చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ తమ సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా ఈ సందర్భంగా ఎమ్మార్వో నజీర్ అహ్మద్ ను వారు కోరారు.












Comments