top of page

అంగన్వాడి కార్యకర్తలకు సెల్ ఫోన్లు పంపిణీ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Oct 1, 2022
  • 1 min read

అంగన్వాడి కార్యకర్తలకు సెల్ ఫోన్లు పంపిణీ

ree

కడప జిల్లా, ప్రొద్దుటూరు


రాష్ట్రంలోని అంగన్వాడి పాఠశాలలో అన్ని వసతులు కల్పించి అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ సమావేశ భవనంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కార్యకర్తల సమావేశం సమావేశంలో ఆయన అంగన్వాడి సెంటర్లకు సంబంధించిన కార్యకర్తలకు శాంసంగ్ సెల్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లలో పిల్లలకు కావలసిన ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్షణం అన్నారు అంతకుముందుగా అంగన్వాడీ కార్యకర్తల నుండి అంగన్వాడి సెంటర్ లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో తెలుసుకున్న సమస్యల పరిష్కారానికి ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేశారన్నారు అందులో భాగంగా అంగన్వాడి సెంటర్ల సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉందన్నారు పిల్లలకు కావలసిన ప్లేట్లు గ్లాసులు ఫ్యాన్లు తదితర వస్తువులు ప్రభుత్వ పరిధిలో ఉన్న మేరకు పరిష్కరిస్తామని, ప్రభుత్వ పరిధిలో లేని సమస్యలను తన సొంత నిధులతో పరిష్కరిస్తానని పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో ప్రొద్దుటూరు రూరల్ 123 మందికి అర్బన్ లో 196 మందికి రాజుపాలెం మండలంలో 47 మందికి మొత్తం 367 మందికి సెల్ఫోన్లను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాసిరకమైన ఫోన్లు అందించారని , వైసిపి పాలనలో 13 వేల విలువగల ఫోన్ లను అందించి జగన్ నాణ్యతకు నిదర్శనంగా నిలిచారన్నారు త్వరితగతిన అంగన్వాడి కేంద్రాల సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి తన దృష్టికి తెస్తే వారం 10 రోజుల లోపల అంగన్వాడి సెంటర్ల అభివృద్ధికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి మున్సిపల్ కౌన్సిలర్లు పిట్టా బాలాజీ అనిల్ కుమార్ ఇర్ఫాన్ భాషా కమల్ భాష వైసిపి నాయకులు బండారు సూర్యనారాయణ రాగా నరసింహారావు నూరి మరియు సిడిపిఓ లు మున్సిపల్ కమిషనర్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page