top of page

'ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే' కార్యక్రమం ప్రారంభం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Nov 9, 2023
  • 1 min read

ree
పార్టీ జెండా ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు
ree

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


గడిచిన నాలుగున్నర సంవత్సరాల వైసిపి ప్రభుత్వం హయంలో నియోజకవర్గ మండల వార్డుల వారీగా ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా అందించిన లబ్ధిని వివరిస్తూ, ప్రొద్దుటూరు పురపాలక పరిధిలోని 12వ వార్డు, 13వ సచివాలయం, కేహెచ్ఎం స్ట్రీట్ 1 నందు గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. సుందరాచార్యుల వీధిలోని రాయల్ ఫంక్షన్ ప్యాలెస్ వద్ద వైసీపీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ ఖాజా మాట్లాడుతూ, గడచిన నాలుగున్నర సంవత్సర వైసిపి ప్రభుత్వ హయాంలో వార్డ్ ప్రజల ఖాతాలో సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 20 కోట్ల 16 లక్షల 66 వేల 514 రూపాయలు జమ చేయబడినదని, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రానున్న ఎన్నికల్లో మరోమారు వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని కోరారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు కామిశెట్టి బాబు, పట్టణ మహిళా అధ్యక్షురాలు కోనేటి సునంద, కౌన్సిలర్ గరిసపాటి లక్ష్మీదేవి, జిలాన్ భాష, మున్సిపల్ కమిషనర్ రమనయ్య, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page