అమృత నగర్ లో విస్తృత ప్రచారం నిర్వహించిన టిడిపి
- PRASANNA ANDHRA

- Apr 28, 2024
- 1 min read
అమృత నగర్ లో విస్తృత ప్రచారం నిర్వహించిన టిడిపి


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఎన్డీఏ కూటమి బలపరిచిన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని పాత అమృత నగర్ నందు ఆయన సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, సినీ హబ్ అధినేత రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున టిడిపి క్రియాశీలక నాయకులు, కార్యకర్తలు అమృత నగర్ ప్రజలు పాల్గొని టిడిపి మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు.











Comments